Monday, April 7, 2025

శ్రీవారి గరుడ సేవకు వచ్చే భక్తులకు అంకితభావంతో సేవలు అందించండి: టిటిడి ఈవో

సమన్వయంతో భక్తులకు సేవలు అందించండి : అదనపు ఈవో

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రముఖమైన గరుడసేవకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వకంగా సేవలందించాలని టిటిడి ఈవో శ్రీ జె .శ్యామలరావు పిలుపునిచ్చారు. గరుడ సేవకు డిప్యూటేషన్‌ పై నియమితులైన ఉద్యోగులు తమ విధులను పూర్తి అంకితభావంతో నిర్వర్తించాలని, తమ పనిలో తమ హృదయాన్ని అంకితం చేయాలని టీటీడీ ఈవో కోరారు.

తిరుమల ఆస్థాన మండపంలో సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సిబ్బందిని ఉద్దేశించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో మాట్లాడుతూ, ఈ ఏడాది నాలుగు మాడ వీధుల్లోని 183 గ్యాలరీల్లో గరుడసేవ ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా చేశామన్నారు. గ్యాలరీలలో వేచి ఉన్న యాత్రికుల సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఒక కో-ఆర్డినేటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

“పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉంటే, ఆలస్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. సమన్వయం మరియు సమిష్టి కృషి చాలా ముఖ్యమైనవి,” అని ఈవో అన్నారు.

అంతకుముందు అదనపు ఈవో మాట్లాడుతూ, ప్రతి డిప్యూటేషన్ ఉద్యోగి తన పని ప్రదేశంలో ముందుండాలన్నారు. “మేము గత సంవత్సరాల కంటే మెరుగైన సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేని సేవలను అందించడం కోసం ఎక్కువ మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. తూర్పు మాడ వీధి 176, దక్షణం 76, పడమర 129, ఉత్తరం 182 కోసం నాలుగు మడ వీధులలో 180 గ్యాలరీలలో మొత్తం 563 సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. విధులలో 360 మంది సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు.

తాజా సమాచారం మేరకు తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారని, మంగళవారం ఉదయం 10 గంటలకే గ్యాలరీలన్నీ నిండిపోయే అవకాశాలున్నాయని జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు పాల పంపిణీని ఇప్పటి నుంచే ప్రారంభిస్తామన్నారు.

సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ మాట్లాడుతూ, వాహన సేవలు పూర్తయిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులను బయటకు పంపేందుకు ప్రణాళిక బద్ధంగా ప్రతి వీధికి ఒక ఏవిఎస్ఓ ని ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో యాత్రికులను తరలించేందుకు మాడ వీధులను ఖాళీగా ఉంచుతామన్నారు. అధికారులందరికీ హ్యాండ్ సెట్‌లు అందజేస్తామని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వారు కమాండ్ కంట్రోల్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయవచ్చని ఆయన తెలిపారు. .

గరుడసేవ రోజున ప్రత్యేకంగా నాలుగు మాడ వీధుల్లో 1500 మంది శ్రీవారి సేవకులతో అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ చేయనున్నట్లు టీటీడీ చీఫ్ పీఆర్వో డాక్టర్ టి.రవి తెలిపారు.

అన్నప్రసాదం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, ప్రసాదాల మెనూను పక్కాగా ప్లాన్ చేశామని, ఎలాంటి సమస్య లేకుండా పోలీసులు, విజిలెన్స్‌ సహకారంతో పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, విజిఓ శ్రీ సురేంద్ర మరియు ఇతర సెక్టోరల్ అధికారులు, సీనియర్ అధికారులు, ఇన్‌ఛార్జ్ అధికారులు, డిప్యుటేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com