Sunday, November 17, 2024

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

తూర్పుగోధావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలను కనెక్ట్ చేసే ప్రధాన రహదారి రక్తమోడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది. ఏలూరు జిల్లా టి-నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు వెళ్తున్న మినీలారీ ప్రమాదానికి గురైంది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. ఆ టైంలో మినీలారీలో మొత్తం 9 మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్‌ తప్పించుకుని పరారయ్యాడు.

వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), దేవాబత్తుల బూరయ్య (40), కత్తవ కృష్ణ (40), తాడి కృష్ణ (45), కత్తవ సత్తిపండు (40) నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular