- తప్పుగా భావిస్తే నా మాటలను ఉపసంహరించుకుంటున్నా
- నియంతృత్వ ధోరణి అవలంబించే వారిని నేను విమర్శించాను
- వెలమలని ఉద్దేశించి అలా మాట్లాడలేదు
- నేను మాట్లాడిన మాటలను వెనుక ముందు కత్తిరించి పెట్టారు
- నేను ఒక శాసనసభ్యుడిని అందరినీ గౌరవిస్తా
- షాద్ నగర్ లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్
వెలమలను దూషించారన్న వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. తన మాటలు వెలమ జాతికి సంబంధించినవిగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. తను మాట్లాడిన మాటలను వెనక ముందు కత్తిరించి కొన్ని మాటలను మాత్రమే వివాదాస్పదంగా మార్చి కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని స్పష్టం చేశారు. తను ఒక శాసనసభ్యుడునని అందరి సహకారంతోనే ఎమ్మెల్యేగా మారానని అన్నారు. గత పది ఏళ్లుగా నియంతృత్వ ధోరణి అవలంబించిన కల్వకుంట్ల కుటుంబం గురించి ఉద్దేశించి తను మాట్లాడే తప్ప వెలమ సమాజంపై తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఒకవేళ ఈ మాటలు తప్పుగా భావిస్తే తాను ఈ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. గత కొన్ని రోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కొంతమంది చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం అప్పులు కుప్పలుగా మార్చాలని అని చెప్పే క్రమంలో వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని కానీ ఎవరిని కించపరచాలని గాని వారి మనోభావాలను నొప్పించాలని ఉద్దేశం తనకు లేదని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు ఒక పేదింటి బిడ్డనైన తాను అన్ని వర్గాల సహకారంతోనే ఎమ్మెల్యే అయ్యానని అందరి సహకారం ప్రేమ నాపై ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో ఆ వీడియోలో ముందున్న మాటలని తొలగించి కేవలం వెలమలు అనే మాటలను వైరల్ చేశారని నా మాటల ద్వారా వారి మనసు నొప్పించి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నానని మరోసారి స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, బీసీ సెల్ చైర్మన్ చంద్రశేఖర్, గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు..