బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోనిగ్రావిన్ మ్యూజియంలో కొత్త బంగారు నాణెం విడుదలవ్వగా.. దానిపై షారుక్ ఖాన్ చిత్రంతోపాటు ఆయన పేరును ముద్రించారు. ఈ బంగారు నాణేనాకి సంబందించిన ఫోటోను అభిమానులు సోషల్మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ప్యారిస్ లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలోచాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూఖ్ ఖాన్ మైనపువిగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ గౌరవార్థం ప్యారిస్ లోనిగ్రావిన్ మ్యూజియంలో బంగారు నాణెం కూడా విడుదల చేశారు. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్నిఅందుకున్న రెండవ భారతీయుడు షారూఖ్ ఖాన్. భారతీయ నటుల్లో ఈ గౌరవాన్ని అందుకున్నదిమాత్రం షారుఖ్ ఖాన్ మాత్రమే. భారతీయ సినిమా ఇండస్ట్రీకి సుమారు ముప్పై ఏళ్లకు పైగానటుడిగా సేవలు అందిస్తున్నారు షారుఖ్. దేశ, విదేశాల్లో ఆయన ఎన్నో ఆవార్జులుఅందుకున్నారు. అన్నట్లు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ అనే సినిమాలోనటించనున్నారు. ఈ మూవీలో అతని కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుసమాచారం.