Wednesday, April 2, 2025

షారుక్‌ ఖాన్‌కు అస్వస్థత – ఆస్పత్రిలో చేరిన కింగ్‌ ఖాన్‌

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్, బాద్‌ షా‌ షారుఖ్‌ ఖాన్‌ ఆస్పత్రిలో పాలయ్యారు. అనారోగ్యం కారణంగా నేడు ఆహ్మదాబాద్‌లోని కేడీ హస్పిటల్‌లో చేరినట్టు సమాచారం. డిహైడ్రేషన్‌ కారణంగా ఆయన అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

అయితే ప్రస్తుతం షారుక్‌ ఐపీఎల్‌ బిజీలో ఉన్నారు. కాగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ప్రాంజైజ్‌ యాజమాని అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా మ్యాచ్‌లకు అటెండ్‌ అవుతున్నారు. ఈక్రమంలో ఆయన హీట్‌ స్ట్రోక్‌ తగిలినట్టు తెలుస్తోంది. దాంతో డిహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైనట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చివరిగా జవాన్‌ మూవీతో ప్రేక్షకులను అలరించారు.
ఇదిలా ఉంటే హీట్ స్ట్రోక్ తో ఆహ్మాదాబాద్ ఆస్పత్రిలో చేరిన షారుక్ ఖాన్ చికిత్స అనంతరం కాసేపటి క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన టీం పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com