షేక్ హసీనా పాలనలో భారత్-బంగ్లాదేశ్ మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. జల పంపకాల వివాదాలు పరిష్కార మయ్యాయి. ఇరు దేశాలను కలిపే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు వేగవంత మయ్యాయి. టెర్రరిజాన్ని అరి కట్టేందుకు హసీనా మన దేశంతో కలిసి పని చేశారు.
అయితే, హసీనా రాజీనామాతో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఆ పార్టీ చైనా, పాకిస్థాన్లకు అనుకూలంగా ఉండటం ఇండియాకు తలనొప్పే..