Tuesday, February 4, 2025

శంషాబాద్​లో హైడ్రా కూల్చివేతలు

శంషాబాద్ లో హైడ్రా యాక్షన్ మొదలు పెట్టింది. పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. సదరన్ ప్యారడైజ్ (శ్రీ సంపత్ నగర్)లో 998 గజాల పార్కు ను కబ్జా చేశారంటూ ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు అందింది. శంషాబాద్ మండలంలోని ఊట్పల్లి గ్రామం కెప్టౌన్- 2 కాలనీలో 33 అడుగుల రహదారి ఆక్రమించి ప్రహరీ నిర్మించినట్లు మరో ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో కబ్జా జరిగింది నిజమేనని తేలింది. దీంతో హైడ్రా సోమవారం రంగంలోకి దిగింది. ఆయా నిర్మాణాలను నేలమట్టం చేసింది. పార్కు చుట్టూ ఫెన్సింగ్ తో పాటు రేకుల షెడ్డు ను తొలగించింది. రహదారి ఆక్రమించి నిర్మించిన ప్రహరీని సైతం కూల్చివేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణలు చేపడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హైడ్రా అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com