నాన్న సంపాదించిన ఆస్తిని చెరిసగం పంచుకోవాలని సూచించారు
నాన్న చెప్పిన మాటకు అప్పుడు నువ్వు కూడా అంగీకరించావు
కానీ నాన్న మరణం తర్వాత మాట తప్పావు
భారతి సిమెంట్స్, సాక్షిలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు నాపై ఒత్తిడి చేశావు
బుల్లోజ్ చేసి బలవంతంగా ఒప్పందం చేసుకున్నావు
అన్న అనే గౌరవం, కుటుంబం పరువు కోసం మేజర్ షేర్ వదులుకున్నా
31-8-2019న జరిగిన ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించావు
కేవలం కొన్ని ఆస్తులు మాత్రమే నాకు ఇచ్చారు
ఇప్పుడు కన్న తల్లి, తోబుట్టువుపైనే కేసులు పెట్టావు
నాన్న మాటతోపాటు ఒప్పందాన్నీ ఉల్లంఘించావు
నువ్వు పంపిన లేఖ ఒప్పందం, వాస్తవానికి విరుద్ధం
అమ్మపై, నాపై కేసు వేస్తావని నాన్న కలలో కూడా ఊహించివుండరు
పేరు బదలాయించకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేశావు
భారతి, సండూర్ పవర్‌లో అమ్మ వాటాను గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చేందుకు నువ్వు, భారతి సంతకాలు చేశారు
వాటాలు ఇవ్వకుండా అనవసరంగా కోర్టుకెక్కావు
సరస్వతి పవర్ వాటాల విషయంలో అమ్మకు పూర్తి అధికారం ఇచ్చావు
అన్నింటికి ఒప్పుకుని ఇప్పుడు వివాదం కోర్టుకు తీసుకెళ్లావు
సరస్వతి పవర్‌లో న్యాయబద్ధంగా నాకే వాటా ఉంది
నా రాజకీయ జీవితం నా ఛాయిస్.. నన్ను డిక్టేట్ చేయలేవు వైఎస్ షర్మిల.