Monday, March 10, 2025

శర్వా బర్త్‌డే స్పెషల్‌ మూవీ ఎనైన్స్‌మెంట్స్‌

హీరో శర్వానంద్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కి సైన్ అప్ చేస్తున్నారు. తన 35వ చిత్రం ‘మనమే’ విడుదలకు సిద్ధమౌతుండగా, నెక్స్ట్ తన 36వ సినిమా చేయనున్నారు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా #శర్వా37 అనౌన్స్ చేశారు. తన గత సినిమా సామజవరగమన తో సెన్సేషనల్ హిట్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు #శర్వా37కి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వానంద్ పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో కనిపించారు. పోస్టర్‌లో సీరియస్‌గా చూస్తున్నారు. #Sharwa37 జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్ గా ఉండబోతుంది. పోస్టర్ ని క్యారికేచర్ గా డిజైన్ చేశారు. హిలేరియస్ రైటింగ్ కి పేరుపొందిన రామ్ అబ్బరాజు, శర్వానంద్‌ను హ్యుమరస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారు.

శర్వానంద్, యూవీ క్రియేషన్స్ ఫోర్త్ కొలాబరేషన్

ప్రస్తుతం తన 35వ చిత్రం ‘మనమే’ చేస్తున్న హీరో శర్వానంద్, నెక్స్ట్ యువి క్రియేషన్స్ నిర్మించబోతున్న ఎక్సయిటింగ్ ఫిల్మ్ కోసం సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘లూజర్’ ఫేమ్ దర్శకుడు అభిలాష్ కంకరతో జతకట్టనున్నారు. అభిలాష్ కంకర ‘మా నాన్న సూపర్‌హీరో’ తో డెబ్యు చేస్తున్నారు. #శర్వా36 అతని సెకండ్ డైరెక్షన్ వెంచర్. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు..మూడు పెద్ద బ్లాక్‌బస్టర్‌లను అందించిన శర్వానంద్‌కి యూవీ క్రియేషన్స్ లక్కీస్ట్ ప్రొడక్షన్ హౌస్.

శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఈ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పోస్టర్ డస్టీ రోడ్ పై రేసులో బైక్ రైడర్‌లను చూపిస్తోంది. రేసులో తన ప్రత్యర్థులను అధిగమించేందుకు ఎత్తుగా ఎగురుతున్న రైడర్ జాకెట్‌పై S 36ని మనం చూడవచ్చు. పోస్టర్ సూచించినట్లుగా, ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతోంది, ఇందులో హీరో బైక్ రైడర్‌గా కనిపిస్తారు. సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సమర్పకులు విక్రమ్, హీరో హీరోయిన్స్ పై క్లాప్ కొట్టారు. హీరో శర్వానంద్, దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు.

‘మనమే’- శర్వా వరల్డ్ ఆఫ్ మనమే గ్లింప్స్

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 35వ చిత్రం ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ పూర్తిగా కొత్త లుక్‌లో ఆలరించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత.

ఈ చిత్రానికి ‘మనమే’ అనే ఆహ్లాదకరమైన టైటిల్ లాక్ చేశారు, టైటిల్ లో పూర్తి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పోస్టర్‌లో శర్వానంద్, చిన్నారి- విక్రమ్ ఆదిత్య, ఎత్తైన భవనం పైకప్పుపై చేతిలో పెయింట్ రోలర్‌లతో నిలబడి ఉన్నారు. బాబు వరల్డ్ గమనిస్తుండగా, శర్వా అతని వైపు చూస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లండన్ బ్రిడ్జ్, థేమ్స్ నదిని కూడా చూడవచ్చు. శర్వా స్వెట్‌షర్ట్, ట్రాక్ ప్యాంట్‌లో చాలా ఎలిగెంట్ గా కనిపిస్తున్నాడు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com