నిందితులను కస్టడిలోకి తీసుకున్న విచారిస్తున్న ఏసీబీ
గొర్రెల స్కామ్ లో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. నిందితులను కస్టడిలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులను ఏసీబీ కస్టడి లోకి తీసుకునేందుకు కోర్టు మూడు రోజుల పాటు అనుమతించింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు కస్టడిలోకి తీసుకుని వారి నుంచి మరింత సమాచారాన్ని సేకరించనున్నారు. పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రాంచందర్ నాయక్ , మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్‌లను కస్టడీకి తీసుకున్నారు.
ఈ స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహినూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.