Wednesday, May 14, 2025

నిర్బంధాలు, నిషేధాలను ఎదుర్కొని.. ప్రధానిగా ఓ వెలుగు వెలిగి..!

  • నిర్బంధాలు, నిషేధాలను ఎదుర్కొని..
  • ప్రధానిగా ఓ వెలుగు వెలిగి..!
  • బంగ్లాదేశ్‌ మాజీ పీఎం షేక్‌ హసీనా హిస్టరీ

పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 300 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పరిస్థితి అదుపుతప్పడంతో ప్రధాన మంత్రి పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేశారు. సైనిక విమానంలో ఆమె భారత్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లింది. వాస్తవానికి షేక్‌ హసీనా ఎవరో కాదు.. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ కూతురే.

షేక్‌ హసీనా 1947 సెప్టెంబర్‌ 28న తూర్పు బెంగాల్‌లోని తుంగిపారాలో బెంగాల్లీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి బెంగాలీ జాతీయవాద నాయకుడు, మాజీ ప్రధాని షేక్‌ ముజిబుర్ రెహమాన్‌, తల్లి ఫజిలతున్సెసా ముజీబ్‌. ఆమె తల్లిదండ్రుల ఇద్దరి ఇరాకీ అరబ్‌ వంశానికి చెందిన వారు. బాగ్దాగ్‌కు చెందిన ముస్లిం బోధకుడు షేక్‌ అబ్దుల్‌ అవల్‌ దర్విష్‌ వారసురాలు. ఆయన చివరి మొఘల్‌ శకంలో బెంగాల్‌ చేరుకున్నారు. హసీనా తన చిన్నతనంలో తల్లి, అమ్మమ్మ సంరణలో తుంగిపారాలో పెరిగారు. కుటుంబం ఢాకా మారాక మొదట సెగున్‌బాగిచా పరిసరాల్లో నివాసం నివాసం ఉన్నారు.

షేక్‌ హసీనా తుంగిపారా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదివింది. ఆ తర్వాత అజింపూర్‌ బాలికల పాఠశాల, బేగం బద్రున్నెసా బాలికల కళాశాలలో విద్యనభ్యసించింది. ఆమె ఈడెన్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. 1966 -1967 మధ్య ఈడెన్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. 1967లో హసీనా డర్హామ్ నుంచి భౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన బెంగాలీ అణు శాస్త్రవేత్త అయిన ఎంఏ వాజెద్‌ మియాను వివాహం చేసుకున్నారు. హసీనా ఢాకా విశ్వవిద్యాలయంలో బెంగాలీ సాహిత్యాన్ని అభ్యసించింది. అక్కడ ఆమె 1973లో పట్టభద్రురాలైంది. 1954లో ఆమె తండ్రిని పాకిస్థాన్‌ ప్రభుత్వం రాజకీయ ఖైదీగా అరెస్టు చేసిన సమయంలో తండ్రిని అరెస్టు చేయడంపై పలు ఇంటర్వ్యూల్లో విమర్శలు గుప్పించింది. బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంలోనూలో విద్యార్థిగా చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ స్ఫూర్తితో రానిచ్చారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యం అనంతరం ఆమె తండ్రి 1973లో బంగ్లాదేశ్‌కు రెండో ప్రధానిగా పని చేశారు. 1975 తిరుగుబాటు సమయంలో షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన కుటుంబంపై నిషేధం విధించారు. ఆ సమయంలో షేక్‌ హసీనా యూరప్‌లో ఉన్నారు.

ప్రధానిగా 20 సంవత్సరాల పదవీకాలం

ఆ తర్వాత సైనిక ప్రభుత్వం షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌లోకి రాకుండా నిషేధం విధించింది. ఆ తర్వాత ఆమె భారత్‌లో నివాసం ఉన్నారు. ఆమె కుటుంబానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆశ్రయం కల్పించారు. దాదాపు ఆరేళ్ల పాటు ఢిల్లీలోని పండారా రోడ్డులో నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత సైనిక పాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. 1981లో హసీనా ముస్లీం లీగ్‌ పార్టీ అధ్యక్షురాలిగా నియామకమయ్యారు. ఆ తర్వాత పలుసార్లు ఆమెను గృహనిర్భందంలో ఉంచారు. తొలిసారిగా ఆమె 1996లో బంగ్లాదేశ్‌ ప్రధానిగా నియాకమయ్యారు. మళ్లీ 2008 సుదీర్ఘకాలంగా ప్రధానిగా కొనసాగుతూ వస్తున్నారు. దాదాపు ప్రధానిగా 20 సంవత్సరాల వరకు సేవలందించారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సాగిన ఉద్యమంతో చివరకు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. షేక్‌ హసీనాకు రాజకీయ నైపుణ్యం నిబద్ధత విషయంలో మంచి పేరున్నది. ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమం, దౌత్యపరమైన దృష్టితో ప్రధానమంత్రిగా 2009 నుంచి వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం బంగ్లా ప్రభుత్వం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ నేతృత్వంలోని కొనసాగనున్నది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com