అక్కినేని అభిమానులకు పండుగ లాంటి వార్త. అక్కినేని హీరో నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ తల్లి కాబోతున్నారని తెలుస్తోంది. శోభిత ధూళిపాళ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారని సమాచారం అందుతుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త సంచలనంగా మారింది. మరి కొద్ది రోజుల్లో అక్కినేని ఇంట బుల్లి వారసుడు సందడి చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. నాగ చైతన్య- శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్‌గానే జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు. తండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు. దీంతో వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చి హానీమూన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేశారు. ఈక్రమంలోనే శోభిత ధూళిపాళ గర్భవతి అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని వారి కుటుంబం ఇంకా ధృవీకరించలేదు.