Sunday, April 20, 2025

రజనీకాంత్‌ని చూసి షాక్‌

తమిళ్ సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా నేటికీ కూడా తన సత్తా చాటుతున్న నటుడు రజనీకాంత్.. సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ కెరీర్ తొలిదశలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పాపులారిటీ ఉన్న హీరో అయినప్పటికీ రజినీకాంత్ చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా పేరు తెచ్చుకున్న రజినీకాంత్.. నిజజీవితంలో దర్జాలకు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఈ వయసులో కూడా కుర హీరోలకు దీటుగా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో రజనీకాంత్ దూసుకుపోతున్నారు.

 

నిజజీవితంలో ఎంతో సదా సిదాగా కనిపించే రజినీకాంత్ గురించి అభిమానులకు అందరికీ తెలుసు.. కానీ ఆయన ఏ స్థాయి నిరాడంబరతతో ఉంటారు అన్న విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. అసలు సౌండ్ కు టైమ్ ఆగయా రజనీకాంత్ నటించిన సినిమాలలో దళపతి సినిమాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . ఈ మూవీలో ఆయనతోపాటు అరవిందస్వామి నటించారు. ఇందులో అరవిందస్వామి రజినీకాంత్ తమ్ముడి పాత్ర పోషించారు. ఈ మూవీ తర్వాత అరవింద స్వామికి హీరోగా మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. దళపతి చిత్రం స్టోరీ పరంగానే కాక మ్యూజిక్ పరంగా కూడా అప్పట్లో ఎన్నో రికార్డులు సొంతం. రజినీకాంత్ లాంటి పెద్ద హీరోతో ఎలా మింగిల్ అవ్వాలి అని మొదట్లో అరవిందస్వామి ఆలోచించేవారట. ఒకరోజు షూటింగ్ అయిన తర్వాత బాగా అలసిపోయిన అరవిందస్వామి తెలియకుండా రజనీకాంత్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే రూమ్ లో ఏసీ ఆన్ చేసి ఉండడంతో హ్యాపీగా మంచం పై పడుకొని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి అదే గదిలో నేలపై రజినీకాంత్ పడుకుని కనిపించారట.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com