Thursday, December 12, 2024

రామంతపూర్‌లో వింత దొంగ

రామంతపూర్ లో దొరికిన బూట్ల దొంగ

ఒక ఇంట్లో చోరీ జరిగిందంటే నగలు, బైకులు, డబ్బులు మాయమవుతాయి. కానీ, కేవలం ఇంటి ముందు ఉండే బూట్ల కోసమే ఓ వ్యక్తి దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఖరీదైన వస్తువులను దొంగిలిస్తే సమస్యలు వస్తాయని గుర్తించిన సదరు వ్యక్తి.. కేవలం ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తుకెళ్తున్నాడు ఈ వింత దొంగ. ఇప్పటిదాకా 100కుపైగా దొంగతనాలు చేసి వెయ్యి జతల బూట్లను కూడబెట్టాడు.

ఇలాంటి వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు. రామంతపూర్ వాసవి నగర్ లో మల్లేష్, రేణుక అనే దంపతులు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో తమ కాలనీలో బూట్లు మాయం అవుతున్నాయని కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల బూట్ల దొంగతనం ఎక్కువ అవుతుండటంతో.. నాలుగు రోజులుగ కాలనీ వాస్తులు నిఘా పెట్టారు. గురువారం బూట్ల దొంగతనానికి వచ్చిన మల్లేష్‌.. కాలనీ వాసులకు దొరికిపోయాడు.

పట్టుకున్న దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. మల్లేష్‌ గత రెండు నెలల నుండి సుమారుగా 100కు ఇండ్ల ముందు దొంగతనం చేసి వెయ్యి బూట్ల జతలను ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో రూ. 100 లేదా రూ. 200కు అమ్ముకుంటున్నట్టు ఉప్పల్ పోలీసుల విచారణలో తేలింది.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular