Saturday, November 16, 2024

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు సమీపంలో కాల్పులు

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష్య ఎన్నికల వేళ మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌ లోని తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీ చేతబట్టుకుని అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు కాల్పులు జరిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ కు వీకెండ్ లో గోల్ఫ్‌ ఆడే అలవాటు ఉంది. తరుచుగా ఉదయం నుంచి మధ్యాహ్న భోజనానికి ముందు వరకు వెస్ట్‌ పామ్‌ బీచ్‌ లోని తన గోల్ఫ్‌ కోర్టులో గడుపుతారు. శనివారం ఎన్నికల ప్రచారం మగించుకొని ఫ్లోరిడా చేరుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆదివారం గోల్ఫ్‌ ఆడుతుండగా గోల్ఫ్‌ క్లబ్‌ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించాడు. ఆ టైంలో గోల్ఫ్‌ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు ఫెన్సింగ్ లో ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి సీక్రెట్ ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. దీంతో సదరు అనుమానిత వ్యక్తి ఓ కారులో పారిపోయాడని, పోలీసులు వెంబడించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్కడ ఏకే 47 మోడల్‌ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ట్రంప్‌ ను హత్యచేయడానికే దుండగుడు వచ్చినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular