- బీసీ కులగణన నివేదిక తగుల బెట్టడంపై అధిష్టానం సీరియస్
- ఈ నెల 12 వతేదీలోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 55రోజుల పాటు చేపట్టిన బీసీ కుల గణనకు వ్యతిరేకంగా వ్యాఖ్యతలు నివేదిక తగుల బెట్టడం, వరంగల్ బీసీ సభలో కాంగ్రెస్ పార్టీ నియామవళిని ఉల్లంఘిస్తూ పరుష పదజాలంతో ఇతర సంఘాలను వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఏఐసీసీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను తన వ్యాఖ్యలు, విధానాలపై వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులో తెలంగాణ రాష్ట్రంలోని బీసీల మనోభావాలకు తూట్లు పొడుస్తున్న కుల గణన నివేదికను తగులబెట్టినందుకు టీపీసీసీ క్రమశిక్షణా చర్య కమిటీకి పార్టీ కేడర్‌తో పాటు ఓబీసీ సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు, ఫిర్యాదులు, మెమోరాండాలు అందినట్లు తెలుపారు.
పార్టీ అధినాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ వ్యవహరిస్తోన్న కుల గణనకు వ్యతిరేకంగా మల్లన్న పత్రికా ముఖంగా పరుష పదజాలాన్ని వాడటం, పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి మీ వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించటంపై ఆగ్రహం ప్రదర్శిస్తూ నోటీసులో పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలోని నిబంధనలు, మార్గదర్శకాలు విధానాన్ని ఉల్లంఘించటంపై వివరణను ఒక వారంలోపు సమర్పించవలసిందిగా నోటీసు జారీ చేయబడిన తేదీ నుండి 12వ తేదీలో అందించాలన్నారు. లేని పక్షంలో కఠినమైన, రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకుంటామని మల్లన్నకు ఏఐసీసీ హెచ్చరించింది.