పాలమీగడ లాంటి అందాలని ఆద్ది శ్రద్దగా సృస్ట్షించా డేమో బ్రహ్మ తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. .ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్, నటి శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో శ్రద్ధా దాస్ నటించింది. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో తొలిసారి తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది శ్రద్ధా దాస్ ఆమె బాల్యం, విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. చిన్నతనం నుంచే నటనపై మక్కువ కలిగి ఉండేది. తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్ షాప్స్ కు అటెండ్ అయ్యేది.తెలుగులో తొలి సినిమా చేయగానే వరుసగా అవకాశాలు ఆమెకు దక్కాయి. డైరీ, అధినేత, ఆర్య 2 చిత్రాల్లో శ్రద్ధ నటించింది. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలైనా కూడా నటించేందుకు ఒప్పుకొని మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే చేయాలనే నిబంధన పెట్టుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంది.. తెలుగుతో పాటు కన్నడ, బెంగాలీ, హిందీ మూవీల్లో సుమారు 30 సినిమాల్లో శ్రద్ధ నటించింది. నేడు శ్రద్ధదాస్ పుట్టినరోజు.
అల్లు అర్జున్ఆర్య 2 సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది మోస్ట్బ్యూటిఫుల్హీరోయిన్శ్రద్ధా దాస్. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అల్లరి సిద్ధు ఫ్రం శ్రీకాకుళం మూవీతో పరిచయమైంది. తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడ వేగ వంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది. పాత్రికేయ రంగంలో డిగ్రీ.. 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్తో పాటు మరో హీరోయిన్గా నటించింది. శాంతి పాత్రలో.. తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్అల్లు అర్జున్, క్రియేటివ్డైరెక్టర్సుకుమార్కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్గ్లామర్తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. 40 సినిమాల్లో.. అనంతరం డార్లింగ్, నాగవల్లి, మరో చరిత్ర, ముగ్గురు, మొగుడు, రేయ్, డిక్టేటర్, గుంటూర్ టాకీస్, పీఎస్వీ గరుడ వేగ, ఏక్మినీ కథ వంటి తదితర చిత్రాలలో నటించింది. మొత్తంగా తెలుగు, తమిళ్, పిందీ భాషల్లో కలిపి సుమారు 40 సినిమాల్లో నటించి తన గ్లామరేంటో చూపించింది.