శ్రావణ మాసం మొదలైంది. ఈ నెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్ 4 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భాజాలు, శుభ కార్యాలు, ప్రారంభోత్సవాలు సైతం షురూ కానున్నాయి. కాగా, 9న నాగుల పంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి పండుగలు ఉన్నాయి.