Thursday, January 9, 2025

మోదీపై పోటీ మిమిక్రీ ఆర్టిస్ట్​ శ్యామ్​ రంగీలాకు షాక్​

  • మోదీపై పోటీ
  • మిమిక్రీ ఆర్టిస్ట్​ శ్యామ్​ రంగీలాకు షాక్​
  • వారణాసి బరిలో 15 మంది అభ్యర్థులు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వారణాసిలో మోదీపై పోటీకి దిగిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ శ్యామ్‌ రంగీలాకు ఎన్నికల అధికారులు ఝలక్‌ ఇచ్చారు. ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు.

నామినేషన్‌ తిరస్కరణపై రంగీలా స్పందించారు. ఈ మేరకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్‌ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. నామినేషన్ దాఖలకు ఎన్నిసార్లు ప్రయత్నించినా జిల్లా యంత్రాంగం తనను అనుమతించలేదని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా శ్యామ్ రంగీలా పోస్ట్ పెట్టారు. ముందుగా మే 10, 13 తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు చెప్పారు. అనంతరం చివరిరోజైన మే 14న నామినేషన్‌ వేయడానికి వెళ్లగా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎలాగోలా చివరి నిమిషంలో నామినేషన్‌ వేసినట్లు వివరించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం చర్యను చూసి నవ్వాలో..? ఏడవాలో..? తెలియట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాజస్థాన్‌కు చెందిన శ్యామ్‌ రంగీలా.. ప్రధాని మోదీ గొంతును అనుసరిస్తూ సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు.

బరలో 15 మంది

వారణాసి స్థానం నుంచి మొత్తం 55 మంది బరిలోకి దిగి నామినేషన్‌ దాఖలు చేశారు. అందులో 36 పత్రాలను అధికారులు తిరస్కరించారు. ఇందులో శ్యామ్‌ రాంగీలా నామినేషన్‌ కూడా ఉంది. ప్రస్తుతం వారణాసి బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నుంచి అజయ్‌ రాయ్‌ బరిలోకి దిగారు. వారణాసి స్థానానికి జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com