Friday, March 21, 2025

వైష్ణవితో ముద్దు కోసం సిద్ధు

సిద్దు జొన్నలగడ్డ బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం జాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన భోగవల్లి ప్రసాద్‌ బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ‘కిస్’ సాంగ్ ని వీడియో ప్రోమోతో మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సిద్దు, వైష్ణవి పై ఈ సాంగ్ తెరకెక్కగా’ఇంత పెద్ద హైదరాబాద్ లో ముద్దుపెట్టుకోవడానికి నాకంటు ఒక ప్లేస్ లేకపోవడమా అనే సిద్దు వాయిస్ తో సాంగ్ ప్రారంభమైంది. టోటల్ లిరిక్స్ ఎంతో క్యాచీగా ఉండగా సాంగ్ లో వైష్ణవి కి సిద్దు పెట్టడానికి రకరకాల ప్లేస్ ల్లో ట్రై చెయ్యడం,అవి ఫెయిల్ అవ్వడం చూపించారు.ఈ ఒక్క సాంగ్ తోనే మూవీపై అంచనాలు పెరగడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. బొబ్బిలి సురేష్ సంగీతంలో ప్రముఖ సింగర్స్ జావేద్ అలీ,అమల చేబోలు కిస్ సాంగ్ ని ఆలపించగా,సనారే సాహిత్యాన్ని అందించాడు.టాప్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం నృత్య సంగీత దర్శకత్వంలో సాంగ్ తెరకెక్కింది. ఏప్రిల్ 10 న థియేటర్స్ లో అడుగుపెడుతుండగా నరేష్,బ్రహ్మాజీ,ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాంగ్ విషయానికి వస్తే, ‘జాక్’ తన ప్రేయసితో ఓ ముద్దు కోసం ప్రైవసీగా ఉండే చోటు వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. ఆ వేదికగా ఓ సినిమా థియేటర్‌ను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. అల్లరి టచ్‌తో కూడిన ఈ రొమాంటిక్ మెలొడీ పాట యువతను బాగా ఆకట్టుకునేలా ఉంది. సిద్ధు-వైష్ణవి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.

 

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com