గోడకూలి ఏడుగురు భక్తుల మృతి
నిజరూప దర్శనం కోసం వొచ్చి మృత్యువాత
భారీ వర్షంతో తడిసిన గోడ కూలడంతో ప్రమాదం
సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది.ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న సహాయకసిబ్బంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సక్షించారు. వెంటనే మృతదేహాలను కేజీహెచ్ హాస్పిటల్‌కి తరలిస్తున్నారు.
సింహాచలం చందనోత్సవం వేళ భారీ వర్షం కురియడంతో గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రసాదం స్కీం కింద అక్కడ గోడ నిర్మించారు. అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అందులో భాగంగా గోడ కట్టారు. ఆ గోడ పక్కనుంచే రూ. 3 వందల టిక్కెట్ లైన్ ఉంది. బుధవారం తెల్లవారుజాము 2:30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఈ క్రమంలో ఆ ప్రక్క నుంచి క్యూ లైన్ నుంచి వెళుతున్న భక్తులపై గోడ పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. క్షతగాత్రుల తరలింపునకు 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగు తున్నాయి. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.