మలయాళం మూవీస్ అంటే మోస్ట్‌లీ కంటెంట్ బేస్డ్ ఉంటాయి. మేకింగ్ కన్నా కూడా కథకు ప్రాధాన్యత ఉన్న లొకేషన్‌ని మాత్రమే ఎంచుకుంటారు. లొకేషన్స్ కాస్టీగా అనిపించకపోయినా కథని బట్టి ప్రేక్షకులని ఆ సినిమాలు ఆకట్టుకుంటాయి. చంద్రముఖి చిత్రం మనందరికీ తెలిసి ఓ భారీ చిత్రం. కానీ అది మొదటిసారి మలయాళంలో చిన్న సినిమాగా తెరకెక్కింది. ఒక ఓటీటీ ద్వారా అందరికీ పరిచయమైన సినిమా లూసీఫర్ చిన్న సినిమా. కానీ అది చిరంజీవి టేకప్ చేశాక పెద్ద సినిమాగా మారింది. మరి ప్రస్తుతం పెద్ద హిట్టయ్యాక ఇప్పుడు అది పెద్ద సినిమాగా మారింది. లూసీఫర్ సీక్వెల్ ఎంపురాన్2గా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఫస్ట్‌పార్ట్‌కి సెకండ్ పార్ట్‌కి నిర్మాణంలో చాలా భారీతనం కనిపించింది.
ఫస్ట్‌పార్ట్ ఎమోషన్స్ సెకండ్ పార్ట్‌లో కూడా క్యారీ అయ్యాయి. కానీ నిర్మాణ విలువలు పెరగడంతో కంటెంట్‌పై ఫోకస్ తగ్గిందని చెప్పవచ్చు. పాన్ ఇండియా లుక్ రావాలని మేకర్స్ బాగా కష్టపడ్డారు. కానీ ట్రైలర్‌లో అసలు కంటెంట్ ఏమిటి అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. స్టైలిష్ మేకింగ్, హైక్వాలిటీ కనిపిస్తుంది కానీ కంటెంట్ లో ఎమోషన్ కాస్త మిస్ అయినట్లు కనిపిస్తుంది. ఇక మోహన్‌లాల్ పైన చాలా తక్కువ షాట్స్ కట్ చేశారు. చూసే ప్రేక్షకుల దృష్టిలో మాత్రం సినిమా చాలా భారీ తనంగా ఉంది. ట్రైలర్ మాత్రం ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో నచ్చేసింది. మరి అసలు కథ విషయం ఏమవుతుందో వేచి చూడాలి మరి.