Wednesday, July 3, 2024

నెరవేరిన కల..!

  • రాష్ట్ర సర్కార్​ చారిత్రక నిర్ణయం
  • ఏకకాలంలో 18,942 మంది ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్లు

ప్రభుత్వ ఉపాధ్యాయుల సుదీర్ఘ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇర‌వై ఏండ్లుగా పదోన్నతుల కోసం వేచి చేస్తోన్న సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు (పీఈటీ)లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. రాష్ట్ర చరిత్రలో మనుపెన్నడూ లేని విధంగా.. భారీ సంఖ్య‌లో ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్లు ఇచ్చింది. ప్ర‌మోష‌న్ల‌కు అడ్డంకిగా మారిన చ‌ట్ట‌ప‌ర‌మైన వివాదాలు ప‌రిష్క‌రించ‌డంలో గ‌త ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హించ‌డంతో అర్హులైన వేలాది మంది ఉపాధ్యాయులు ప్ర‌మోష‌న్ల‌కు నోచుకోలేదు. దీంతో ప్రస్తుతం విద్యా శాఖకు మంత్రిగా వ్యవహరిస్తోన్న సీఎం ఈ అంశంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ప్ర‌మోష‌న్ల‌కు అడ్డంకిగా ఉన్న చ‌ట్ట‌ప‌ర‌మైన అడ్డంకుల‌ను పరిష్కారానికి కృషి చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్న చ‌ట్టప‌ర‌మైన అడ్డంకులు తొల‌గిపోవ‌డంతో ప్ర‌మోష‌న్ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. ఫ‌లితంగా 18,942 మంది ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్లు ద‌క్కాయి.

వీరిలో 17,072 మంది ఎస్జీటీలు.. స్కూల్​ అసిస్టెంట్టుగా, 1870 మంది స్కూల్​ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందారు. మ‌ల్టీజోన్ 1, 2ల్లోని ప్ర‌భుత్వ‌, స్థానిక సంస్థ‌ల ప‌రిధిలోని ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్లు ద‌క్కాయి. అత్యధికంగా ఖమ్మంలో 954 మందికి, మలుగులో అత్యల్పంగా 229 మందికి పదోన్నతులు వరించాయి. అయితే ఎక్క‌డా వివాదాల‌కు తావు లేకుండా పెద్ద సంఖ్య‌లో ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్లు ద‌క్కడం, మొత్తం ప్ర‌క్రియ‌ను ఆన్‌లైన్‌లో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో చేయ‌డంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ అర్హ‌త‌కు త‌గిన‌ట్లు ప్ర‌మోష‌న్లు ద‌క్క‌డంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ క‌ష్టాన్ని, శ్ర‌మ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించ‌డంతో పాటు స‌ముచిత రీతిలో గౌర‌వించ‌డంతో ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో విద్యా బోధ‌న చేప‌ట్టే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా ప్ర‌భుత్వ‌, స్థానిక సంస్థ‌ల పాఠ‌శాల‌ల్లో విద్యా నాణ‌త్య స్థాయి మ‌రింత పెర‌గ‌నుంది.

ప్ర‌మోష‌న్లు- సంఖ్య‌
జోన్‌-కేట‌గిరి-మేనేజ్‌మెంట్‌-సంఖ్య‌
మ‌ల్టీ జోన్ 1-ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌- ప్ర‌భుత్వ‌& స్థానిక సంస్థ‌లు-10,083
మ‌ల్టీ జోన్ 2-ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌- స్థానిక సంస్థ‌లు-5,962
మ‌ల్టీ జోన్ 2-ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌- ప్ర‌భుత్వ‌-1,027
మ‌ల్టీ జోన్ 2-స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్ర‌ధానోపాధ్యాయులు-స్థానిక సంస్థ‌లు-776
మ‌ల్టీ జోన్ 1-స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్ర‌ధానోపాధ్యాయులు-స్థానిక సంస్థ‌లు-995
మ‌ల్టీ జోన్ 1-స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్ర‌ధానోపాధ్యాయులు-ప్ర‌భుత్వ‌-99

మొత్తం–18,942
జోన్ 1 వ‌రంగ‌ల్ (ప్ర‌ధానోపాధ్యాయులుగా ప్ర‌మోష‌న్లు)-1,094
జోన్ 2 హైద‌రాబాద్ (ప్ర‌ధానోపాధ్యాయులుగా ప్ర‌మోష‌న్లు)-776
జిల్లాల వారీగా ప్ర‌మోష‌న్లు (ఎస్జీటీ నుంచి ఎస్ఏకు)
క్ర‌మసంఖ్య‌-జిల్లా-ప్ర‌మోష‌న్లు
1-ఆదిలాబాద్‌-445
2-కొమ‌రం భీమ్ ఆసిఫాబాద్‌-340
3-మంచిర్యాల‌-458
4-నిర్మ‌ల్‌-416
5-నిజామాబాద్‌-833
6-జ‌గిత్యాల‌-682
7-పెద్ద‌ప‌ల్లి-368
8-జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-277
9-భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-694
10-మ‌హ‌బూబాబాద్‌-517
11-వ‌రంగ‌ల్‌-434
12-హ‌నుమ‌కొండ‌-475
13-క‌రీంన‌గ‌ర్‌-504
14-రాజ‌న్న సిరిసిల్ల‌-394
15-కామారెడ్డి-787
16-సంగారెడ్డి-774
17-మెద‌క్‌-597
18-సిద్దిపేట‌-679
19-జ‌న‌గాం-434
20-య‌దాద్రి భువ‌న‌గిరి-496
21-మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి-302
22-హైద‌రాబాద్‌-749
23-వికారాబాద్‌-581
24-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-497
25-జోగులాంబ గ‌ద్వాల‌-298
26-వ‌న‌ప‌ర్తి-390
27-నాగ‌ర్ క‌ర్నూల్‌-550
28-న‌ల్గొండ‌-897
29-సూర్యాపేట‌-614
30-ఖ‌మ్మం-954
31-ములుగు-229
32-నారాయ‌ణ‌పేట‌-407

మొత్తం-18,942

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular