Thursday, November 7, 2024

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు

గడిచిన నెలలో ఉత్పత్తి 7.48 శాతం పెరుగుదల

గతేడాదితో పోలిస్తే 6.10 శాతం వృద్ధి

ఎగుమతుల్లోనూ వృద్ధి నమోదు

మీడియా కు వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

 

గత నెలలో నల్ల బంగారం ఉత్పత్తిలో భారీ వృద్ధిని సాధించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. బొగ్గుమంత్రిత్వ శాఖ జారీ చేసిన నివేదిక సారాంశాన్ని మంత్రి శనివారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఉత్పత్తిని పెంచడం, లాజిస్టిక్స్‌ను క్రమబద్ధీకరించడం, దేశం ఇంధన లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంపై నిరంతర దృష్టితో, భారతదేశ ఇంధన డిమాండ్‌లను తీర్చడానికి ప్రధాని మోదీ సర్కార్ దూరదృష్టితో పనిచేస్తోందన్నారు. ఫలితంగా బొగ్గు ఉత్పత్తిలో సత్ఫలితాలు సాధిస్తున్నాని కేంద్రమంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మోదీ నేతృత్వంలో మహిళల సముపార్జన కోసం బొగ్గు గనుల కార్యకలాపాలలో శ్రామికశక్తిలో చేర్చామన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించగలిగామని కిషన్​ రెడ్డి తెలిపారు. ఈ రంగంలో కొత్త బెంచ్​ మార్క్​ ను నెలకొల్పామన్నారు.

అక్టోబర్​ లో 84.45 మిలియన్​ టన్నులు చేరుకుందన్న కేంద్ర మంత్రి.. గతడాది ఇదే నెలలో 7.57 మెట్రిక్​ టన్నులను అధిగమించి 7.48 శాతం వృద్ధిని సాధించిందన్నారు. ఇతర సంస్థల నుంచి కూడా బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని తెలిపారు. ఇది గతేడాది కాలంలో 11.70 మెట్రిక్​ టన్నులతో పోలిస్తే ప్రస్తుత 16.59 మెట్రిక్​ టన్నులకు పెరిగిందన్నారు. 41.75 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. 2024 అక్టోబర్​ వరకు బొగ్గు ఉత్పత్తి 537.45 మెట్రిక్​ టన్నులకు చేరుకుందని మంత్రి జి.కిషన్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.2023–24లో ఇదే కాలానికి ఉత్పత్తి 506.56 మె. టన్నులుగా నమోదైందని, ఇది 6.10 శాతం వృద్ధిని సూచిస్తుందని తెలిపారు. ఎగుమతులు 2023–24ఇదే కాలానికి 541.51 టన్నులు ఎగుమతి చేయగా, 2024 అక్టోబర్​ వరకు 571.39 టన్నులు ఎగుమతి చేశామన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular