Thursday, April 17, 2025

మహిళా ప్రాజెక్టుపై సర్ క్రిస్టోఫర్ ఆంథోనీ తో చర్చించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి: 25-09-2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి, శ్రీ కొండపల్లి శ్రీనివాస్ బ్రిటీష్ బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్, సంఘసేవకులు, యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ సర్ క్రిస్టోఫర్ ఆంథోనీతో న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనువైన పరిస్థితుల గురించి వివరించారు.

రాష్ట్రంలో కర్భన ఉద్గారాల నియంత్రణలో భాగంగా నిరుపేద మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టుకు సాయం చేసేవిధంగా సర్ క్రిస్టోఫర్‌ను ఒప్పించారు. సర్ క్రిస్టోఫర్ ఆంథోనీ ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేయడానికి ఆసక్తిని వ్యక్తీకరించడం జరిగింది. సమావేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కర్బన ఉద్గారాల పెరుగుదల, తద్వారా వస్తున్న వాతావరణ మార్పులు, క ఉద్గారాలను తగ్గించటం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం ద్వారా సానుకూల దృక్పదాన్ని తీసుకురాగలిగారు. సర్ క్రిస్టోఫర్ ఆంథోనీ సహాయం చేస్తానని చెప్పిన నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com