Tuesday, April 22, 2025

ప్రారంభోత్సవానికి సిద్దంగా సీతారాం ప్రాజెక్టు

  • నేడు మూడు పంప్ హౌస్ లు ట్రయల్ రన్
  • ఆగస్ట్ 15 న సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • వైరాలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
  • గోదావరి రివర్ బోర్డుకు చేరిన ప్రాజెక్ట్ అనుమతులు
  • ప్రాజెక్ట్ కు 67 టి యం సి నీటి కేటాయింపులకు ప్రతిపాదనలు.
  • డిస్ట్రుబ్యూటరీల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ వేగవంతం
  • 3.40 లక్షల ఏకరాల ఆయకట్టుకు స్థిరీకరణ
  • కొత్తగా సేద్యంలోకి 2 లక్షల 60 వేల ఆయకట్టు
  • విశ్లేషణాత్మక ప్రణాళికతో ముందడుగు
  • 1,2 ప్యాకేజీలకోసం 3వేల ఎకరాల్లో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్
  • సుప్రీంకోర్టు లో కేసుల సత్వర పరిష్కారనికి చర్యలు
  • కేంద్ర అడవులు పర్యావరణ శాఖాతో సంప్రదింపులకు నిర్ణయం
  • కాలువల నిర్మాణాలకు ఆటంకం లేనివిధంగా పనులు
  • రైల్వే క్రాసింగ్ లపై ఆ శాఖతో సంప్రదింపులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గోదావరి నదిపై చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఈ ప్రాజెక్టుకు చెందిన మూడు పంప్ హౌజ్ లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్ట్ 15 న ఆ మూడు పంప్ హౌస్ లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.అందులో బాగంగా ఈ ఆదివారం రోజున పంప్‌హౌస్‌ల ట్రయిల్ రన్ మొదలు పెడుతున్నట్లు తెలిపారు.సీతారామ ప్రాజెక్ట్ కు చెందిన మూడు పంప్ హౌస్ ల ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతుల పై మంత్రి ఉత్తమ్ శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

నీటిపారుదల శాఖా కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇ. యన్. సి అనిల్ కుమార్,డిప్యూటి ఇ ఎన్ సి కే.శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.పంప్ హౌస్ ల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కు గోదావరి జలాల నుబడి 67 టి యం సీల కేటాయింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని ఆయన వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఐరిగేషన్ నిర్మాణపు పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి సేద్యంలోకి తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖాధికారులు పనులను వేగవంతం చేయాలని అదేశించారు. ప్రాజెక్ట్ నిర్మాణపు అనుమతులు చివరి దశకు చేరడంతో పాటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చేరిందని తెలిపారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తో పాటు కేంద్ర పర్యావరణం అటవీ శాఖాల అనుమతుల పై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ఆయన సూచించారు.

అదే సమయంలో కాలువల నిర్మాణంలో అడ్డుగా ఉన్న రైల్వే క్రాసింగ్ ల వద్ద నిర్మాణం ఆగి పోకుండా ఉండేలా ఆ శాఖతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.34.561,37.551 కిలోమీటర్ల వద్ద ఉన్న క్రాసింగ్ ల విషయమై మంత్రి ఉత్తమ్ ప్రస్తావిస్తూ రైల్వే శాఖతో చర్చించి ఆ శాఖా నిబంధనల మేరకు సత్వరం నిర్ణయం తీసుకోవాలన్నారు.ప్యాకేజ్ 1,2 లకు సరిపడా భూసేకరణను వెంటనే చేపట్టాలన్నారు.ఈ రెండు ప్యాకేజీల కు అవసరమయ్యే మూడు వేల ఎకరాల భూసేకరణ సత్వరమే చెప్పట్టగలిగేతే నిర్దేశిత లక్ష్యానికి సకాలంలో చెరుకోగలుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మొత్తం త్వరితగతిన పూర్తి అయితే 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు, కొత్తగా రెండు లక్షల 60 వేల ఎకరాల ఆయకట్టుకు సేద్యం లోకి వస్తున్నందున పనులు వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులకు ఉద్బోధించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com