Thursday, December 26, 2024

Sitaram project tenders: సీతారాం ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ వేగవంతం కావాలి

  • ప్రాజెక్ట్ లలో పూడిక తీత పనులు సత్వరమే ప్రారంభించాలి
  • యుద్ద ప్రాతిపదికన భూసేకరణ చేపట్టాలి
  • ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్న ప్రాజెక్ట్ ల నిర్మాణాలపై దృష్టి సారించాలి
  • వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు అంకురార్పణ చేసిందని, దీనిలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ నుండి నీటిపారుదల శాఖాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుఫు ఆడిత్యా దాస్ నాధ్, ఇ.ఎన్.సి జనరల్ అనిల్ కుమార్, ఇ.ఎన్.సిఓ అండ్ యం నాగేందర్‌రావులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజినీరు,్ల ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాత క్రమంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లకు పాలనా పరమైన అనుమతులు సత్వరమే తీసుకోవాలని సూచించారు. మోదీకుంట వాగు ప్రాజెక్ట్‌కు అయ్యే అంచనాలతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణ పురోగతిపై ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన భూసేకరణ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించామని ఎప్పటికప్పుడు ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా నియమితులైన వినయ్ కృష్ణారెడ్డి తో సంప్రదింపులు జరిపి భూసేకరణ నిర్వహించాలని ఆయన సూచించారు.

అన్నింటికి మించి ఇసుక మేటలు, మట్టి నిల్వలతో పూడుకు పోయిన ప్రాజెక్ట్‌లలో పూడిక తీత పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పనులను వేగవంతం చేసి ప్రాజెక్ట్‌లలో నీటి సామర్ధ్యం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. సింగూరు ప్రాజెక్ట్ పై నవంబర్ 27న ప్రత్యేక సమీక్ష సమావేశం ఉంటుందని, ఆ సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖామంత్రి దామోదర్ రాజ నరసింహ పాల్గొంటారని అందుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలని తెలిపారు. నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com