సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు కాగా కొంతకాలంగా లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేరిన సీతారాం ఏచూరిని ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి తరలించారు వైద్యులు. మరోవైపు ఇటీవలే ఆయన కంటికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.