టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకే కాదు.. సోషల్ మీడియాలో ఆయన ముద్దుల కూతురు సితారకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సందర్భంగా సితారకు మహేష్ బాబుతో పాటు నమ్రత, అన్నయ్య గౌతమ్ కృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు ఎంతో మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. సితార ప్రతీ చిన్న సందర్భాన్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు అపడేట్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఆనందపరుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అంతకు ముందు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేసింది. కానీ ఇన్ స్టాలో ఇటీవల డాన్స్ వీడియోస్ ఎక్కువగా షేర్ చేస్తుంది. ప్రస్తుతం సితారకు ఇన్ స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాటకు డాన్స్ అదరగొట్టేసింది.
ఇకపోతే హోలీ పండుగ సందర్భంగా వైట్ కలర్ టీషుర్ట్ పై అన్ని రంగులు పడి ఉన్న పిక్ చాలా బాగా కనిపిస్తుంది ఆ పిక్‌ని ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసింది సితార ఆ ఫొటోకి అభిమానులు లైకులు కొడుతున్నారు. తాత తండ్రి పేరు నిలబెడుతూ ఘట్టమనేని వారసురాలిగా పేరు నిలబెట్టుకుంటుంది. అలాగే ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ముఖ్యంగా మహేష్ పాటలకు సితార డాన్స్ అదరగొట్టేస్తుంది. ఇప్పటికే సీతూపాప షేర్ చేసిన డాన్స్ వీడియోస్ మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంటున్నాయి. తాజాగా సూపర్ హిట్ గుంటూరు కారం మూవీలోని దమ్ మసాలా పాటకు డాన్స్ ఇరగదీసింది. ఆ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేయగా.. తెగ వైరలవుతుంది.పిఎమ్‌జె జ్యువెల్స్ వాణిజ్య ప్రకటనకు సంబంధించి ఆ మధ్య సితార ఫొటోలు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద ప్రదర్శించారు. దీంతో సితార పేరు మరోసారి మారుమోగిపోయింది. అప్పుడే సితార ఇంత పెద్దదైపోయందా.. అబ్బా, ఎంత బాగుందో అంటూ తెలుగు ప్రేక్షకుల మురిసిపోయారు. ఇక మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు.