Monday, July 1, 2024

షాద్‌నగర్ ప్రమాద ఘటనపై అధికారులను అప్రమత్తం చేసిన సిఎం

షాద్‌నగర్ ప్రమాద ఘటనపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని, కలెక్టర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సిఎం ఆదేశించారు.

షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాసు పరిశ్రమలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాల య్యాయి. కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కంప్రెషర్ పేలడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular