Wednesday, September 18, 2024

‘సర్దార్ 2’ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సూర్య

హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైయింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కార్తీ, ఎస్ జె సూర్య లని స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కనుంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular