Wednesday, December 25, 2024

చియాన్ విక్రమ్ 62వ ప్రాజెక్ట్‌లో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య

విలక్షణ నటుడు, ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం తన 62వ ప్రాజెక్ట్‌ను ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం చియాన్ 62 అని వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి విలక్షణ నటుడు ఎస్ జే సూర్య కూడా ఎంట్రీ ఇచ్చారు. నేడు ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఎస్.యు. అరుణ్ కుమార్ గతంలో ‘పన్నయ్యరుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, ‘సింధుబాద్’, ఇటీవలి హిట్ ‘చిత’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చియాన్ విక్రమ్ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ గతంలో ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య ఎంట్రీతో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం వెల్లడించింది.

చియాన్ విక్రమ్, ఎస్ జే సూర్యల కలయికతో అభిమానులలో అంచనాలను పెంచడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తిని క్రియేట్ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com