Thursday, November 28, 2024

స్మితాకు న్యూ పవర్స్‌ కొత్త బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో కీలక అధికారిగా సీఎంఓలో చక్రం తిప్పిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌కు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడింది. సరైన పోస్టింగ్‌ ఇవ్వకుండా.. రేవంత్‌ సర్కారు కొంతకాలం పక్కన పెట్టింది. కానీ, కారణాలు ఏమిటో తెలియదుగానీ.. తాజాగా స్మితాకు కొన్ని కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలోనే స్మితా సభర్వాల్‌ రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా కొత్త బాధ్యతలు స్వీకరించారు. మెున్నటి వరకు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహించిన ఆమెకు.. ఈ నెల 12న కొత్త పోస్టింగ్ కల్పించారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా స్మిత అక్కడే ఉండగా.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ సీనియర్ ఐఏఏస్ అధికారిణి స్మితా సబర్వాల్ కొత్త బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. మెున్నటి వరకు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహించగా.. 20 రోజుల క్రితం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు ఆమెను రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతి శాఖ కార్యదర్శిగా బదిలీ చేయగా.. బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మెున్నటి వరకు ఎన్నికల అబ్జర్వర్‌గా స్మిత అక్కడే ఉన్నారు. మహారాష్ట్రలోని బుల్దానా, మల్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జనరల్ అబ్జార్వర్‌గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమెను నియమించింది. దీంతో సుమారు నెల రోజులుగా స్మితా సబర్వాల్ మహారాష్ట్రలో తన సేవలందించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.
స్మితా సబర్వాల్ 2001లో ట్రైనీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. అనంతరం ఉమ్మడి ఏపీలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పనీతీరులో, నలుగురికీ సాయపడుతూ ప్రత్యేక గుర్తింపును పొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. మిషన్ భగీరథ ముఖ్య కార్యదర్శిగానూ పని చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. తాజాగా అక్కడ్నుంచి కూడా బదిలీ చేసి రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా కొత్త బాధ్యతలు అప్పగించారు.
కాగా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్.. పలు సామాజిక అంశాలపై డెరైక్టుగా, రాజకీయ అంశాలపై పరోక్షంగా స్పందిస్తుంటారు. సెలవు రోజుల్లోనూ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. ఆమె భర్త అకున్ సబర్వాల్ ఐపీఎస్ ఆఫీసర్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular