భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5. దీని నుంచి రాబోతున్న ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనేక భావోద్వేగాల కలయికగా ఈ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కింది. ఓ కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే వివిధ రకాలైన సమస్యలను, ఎమోషన్స్‌ను చక్కగా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. రోనీ స్క్రూవాలా ఆర్ఎస్విపి మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
ట్రైలర్‌ను గమనిస్తే… ప్రకృతి అందాలతో ఆకట్టుకునే కేరళ పచ్చటి అందాల నడుము తెరకెక్కిన కథే లవ్ సితార. తార (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్ర్య భావాలున్న ఇంటీరియర్ డిజైనర్. అంతర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళతారు. అక్కడ పెళ్లి జరగటానికి ముందు కుటుంబాల్లోని విబేదాలు, తెలియకుండా దాగిన నిజాలు బయటపడతాయి. చివరకు ఈ జంట ప్రయాణం ఎటువైపు సాగిందనేదే సినిమా. సోనాలి కులకర్ణి, బి.జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రే తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. లవ్, సితార సెప్టెంబర్ 27న జీ5లో ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది.ఈ సందర్భంగా..
శోభితా దూళిపాల మాట్లాడుతూ,‘‘సితారలో నటిచడం చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్యమైన పాత్ర. స్వతంత్య్ర భావాలున్న ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో నటించాను. నిజాయతీగా ఉండే ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కొందనేదే కథ. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి”అని అన్నారు.
రాజీవ్ సిద్ధార్థ స్పందిస్తూ,‘‘లవ్, సితార’ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది. అందులో అర్జున్ అనే పాత్రలో నటించాను. నేను ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి మలుపు తీసుకుంది. నా చుట్టు ఉన్న పాత్రల్లో ఉన్న సంక్లిష్టత వాస్తవికతను ఎంత దగ్గరగా ఉంటాయనేది ఆసక్తిని రేపే విషయం. శోభితగారితో కలిసి నటించటం మంచి ఎక్స్‌పీరియెన్స్. జీ 5 ప్రేక్షకులను ఈ ఒరిజల్ ఫిల్మ్ మెప్పిస్తుందనే నమ్మకం ఉందిరియు ‘లవ్, సితార’ ప్రతి జీ5 వీక్షకుడికి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను”అని అన్నారు.
డైరెక్టర్ వందన కటారియా మాట్లాడుతూ “ లవ్ సితార’ అనేది ప్రేక్షకులకు ఓ ఆహ్లాదకరమైన ప్రయాణం. చక్కటి ఫ్యామిలీ డ్రామా. ఆర్ఎస్విపితో కలిసి పని చేయటం, అలాగే ఈ ప్రయాణంలో జీ5 నుంచి దొరికిన మద్ధతు చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నాను. ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రేమ, కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉండే భావోద్వేగాలను ఇందులో చక్కగా చూపించాం’’ అన్నారు.