Wednesday, October 16, 2024

విద్యార్థులపై దుష్ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా… TSUTF

యుటిఎఫ్ పూర్వ అధ్యక్షులు సీనియర్ నాయకులు నాగటి నారాయణ గారి రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చెన్నుపాటి భవన్ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయం నందు “విద్యారంగంపై మీడియా ప్రభావం” అనే అంశంపై నిర్వహించిన స్మార కోపన్యాసం లో ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ. నర్సిరెడ్డి మరియు ప్రధాన వక్తగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి లు పాల్గొని మాట్లాడుతూ విద్యారంగంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోందని, విద్యార్థులు దుష్ప్రభావానికి గురవుతున్నారని, విలువలతో కూడిన విద్య స్థానంలో కార్పొరేట్ కల్చర్, డబ్బు ప్రభావం పెరుగుతుందని, మూఢత్వం అశాస్త్రీయ ఆలోచనల భావజాలం పెరుగుతుందని ఇది రాబోయే తరానికి చాలా ప్రమాదకరంగా మారుతుందని ఇలాంటి ప్రభావాన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉన్నదని విద్యా విధానంలో సైంటిఫిక్ టెంపర్ పెంపొందించే ప్రయత్నం ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

సోషల్ మీడియాలో కంటెంట్ సైతం విపరీత ధోరణితో హింసను ప్రేరేపించే విధంగా ముందుకు వస్తుందని దీని ద్వారా నేర ప్రవృత్తి పెరుగుతుందని వాపోయారు. నాగటి నారాయణ గారు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి హోదాలో 13 సంవత్సరాల పాటు పనిచేసి ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని, నాటి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ గా ఉండి మంచి పిఆర్సి సాధించడంలో, ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానం రద్దు మరియు నోషనల్ ఇంక్రిమెంట్స్ సాధనలో కీలకంగా వ్యవహరించారని, స్పెషల్ విద్యా వాలంటీర్లుగా పనిచేసిన టీచర్లకు నియామకాల నుంచి పాత పెన్షన్ సాధించేవరకు వివిధ పోరాటాలు నిర్మించారని, ఒకవైపు యుటిఎఫ్ స్వతంత్ర కార్యచరణ ముందుకు తీసుకెళ్తూ మరోవైపు ఐక్య ఉద్యమాల నిర్మాణంలో కీలక భూమిక పోషించిన నాయకుడు నాగటి నారాయణ గారు ,వారి ఆశయ సాధనలో టీఎస్ యుటిఎఫ్ కార్యకర్తలు, నాయకులు నిరంతరం ఆందోళన- పోరాటాలు నిర్వహిస్తూ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం, ఉపాధ్యాయ సంక్షేమం కోసం పనిచేయాలని తెలిపారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, కోశాధికారి టి .లక్ష్మారెడ్డి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక సంపాదకులుపి .మాణిక్ రెడ్డి, సీనియర్ నాయకులు నరహరి, కృష్ణమూర్తి రాష్ట్ర కార్యదర్శిలు రాజశేఖర్ రెడ్డి, సోమశేఖర్, సింహాచలం రాష్ట్ర కమిటీ సభ్యులు సైదులు, వెంకటేశ్వర్లు, బి సాయిలు, యాదయ్య, వెంకటప్ప, గోపాల్ నాయక్, శ్యామ్, రాజారావు, జై సింహ రెడ్డి, మదన్ రెడ్డి ల తోపాటు వివిధ జిల్లాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular