సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని కంప్లైంట్ లో నిధి పేర్కొంది. ఈ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఈ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.
కెరీర్ పరంగా నిధి అగర్వాల్ కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఆమె రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.