Friday, September 20, 2024

‘భలే ఉన్నాడే’ సోఫియా సాంగ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూవీ నుంచి ‘సోఫియా’ సాంగ్ ని లాంచ్ చేశారు.

హార్ట్ బ్రోకెన్ బాయ్స్ అందరికీ డెడికేట్ చేసిన ఈ నెంబర్ ని శేఖర్ చంద్ర చాలా క్యాచిగా కంపోజ్ చేశారు. శేఖర్‌చంద్ర, దేవ్ రాసిన లిరిక్స్ కి కరీముల్లా వోకల్స్ చాలా ఎడిక్టివ్ గా వున్నాయి. ఈ సాంగ్ లో రాజ్ తరుణ్ డ్యాన్స్ మూవ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం స్పెషల్ ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో వుంది. ఈ చిత్రానికి నగేష్ బానెల్లా డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్. బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos