Friday, January 31, 2025

సాఫ్ట్ వెర్ ఇంజనీర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోకపేట్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగప్రభాకర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 7 అంతస్థుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న నార్సింగ్‌ పోలీసులు ఘటనా స్థలానికి తరలివచ్చి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆంద్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
నాగప్రభాకర్‌ తన విధులను ముగించుకుని కోకపేట్‌లోని తన హాస్టల్‌ గదికి వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డాడు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల ఇంకా బలమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com