Sunday, September 29, 2024

రిజిస్టర్ కాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ’రెరా’ అథారిటీ షోకాజ్ నోటీసులు

’రెరా’ నిబంధనలు ఉల్లంఘించిన Sonesta Infiniti, Hastina Realty Pvt real estate సోనెస్టా ఇన్‌ఫినిటి, హస్తినా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రెరా అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. గచ్చిబౌలి కేర్ హాస్పటల్ వెనుక ఉన్న జయభేరి ఫైన్ కాలనీలో స్కై విల్లాస్ నిర్మాణాలకు సోనెస్టా ఇన్‌ఫినిటి ప్రమోటర్ ’రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండానే సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసిందని రెరా ఆరోపించింది.

అలాగే హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ ”బ్రిస్సా” ప్రాజెక్టు పేరుతో శ్రీశైలం హైవే సమీపంలోని కడ్తాల్ టౌన్ ఫార్మా సిటీ వద్ద ”రెరా” రిజిస్ట్రేషన్ లేకుండా సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి, వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా ప్రజలను, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం “RERA” Authority ”రెరా” అథారిటీ దృష్టికి రావడంతో ఈ రెండు ప్రాజెక్టుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని అథారిటీ ఆదేశించింది.

3 (1), 4(1) of the RERA Act రెరా చట్టంలోని 3 (1), 4(1) నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టలు, ఏజెంట్లు తప్పనిసరిగా తమ ప్రాజెక్టలను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేనిచో సదరు ప్రాజెక్టులు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సెక్షన్ 59 ప్రకారం అపరాధ రుసుము విధించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రెరా అథారిటీకి అధికారం ఉందని పేర్కొనారు.

ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయదలచిన వారు ఎవరైనా ’రెరా’ రిజిస్టర్ ప్రాజెక్టులో మ్రాతమే కొనుగోలు చేయాలని, ప్రీలాంచ్ ఆఫర్లు, మోసపూరిత ప్రకటనలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని రెరా అథారిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్టర్స్, భవన నిర్మాణదారులపై వాట్సాప్ నెం. 9000006301, ఫోన్ నెం. 404 29394972లకు ఫిర్యాదు చేయాలని అథారిటీ కార్యదర్శి ఆమోదంతో రెరా ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular