Sunday, February 2, 2025

గర్భగుడిలో పాట షూటింగ్‌

కాళేశ్వరం ఆలయంలో అపచారం.. భక్తులను ఆపేసి మరి ప్రైవేటు ఆల్బమ్‌ షూటింగ్‌

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. సాధారణంగా ఆలయంలో సెల్‌ఫోన్‌తోనే ఫొటోలు, వీడియోలు చిత్రీకరించనివ్వరు. అలాంటిది ప్రముఖ పుణ్యక్షేత్రంలో పెద్ద పెద్ద కెమెరాలతో ఓ ప్రైవేటు ఆల్బమ్‌ను షూట్‌ చేశారు. గుడి తలుపులు మూసేసి మరీ గర్భగుడిలో ప్రైవేటు ఆల్బమ్‌ను చిత్రీకరించారు. ఇందుకోసం దర్శనానికి వచ్చిన భక్తులను సైతం బయటే నిలిపివేయడం గమనార్హం. ఈ ఘటనపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులను నిలిపివేసి మరి ఆలయ గర్భగుడిలో ఓ ప్రైవేటు ఆల్బమ్‌ చిత్రీకరిస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పవిత్రతను అధికారులు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యలైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ కాళేశ్వర ఆలయ ప్రత్యేకత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ ఆలయం ఉంది. త్రిలింగాల్లో ఇది ఒక ప్రదేశం (ద్రాక్షారామం, శ్రీశైలం). కాళేశ్వరాలయానికి ముక్తేశ్వరాలయం అని పేరు. ఈ ఆలయంలో ఒకే వేదికపై రెండు శివలింగాలు ప్రతిష్ఠించబడినవి.ఒక శివలింగానికి కాళేశ్వరుడు, రెండో లింగానికి ముక్తేశ్వరుడు అని పేర్లు ఉన్నాయి. ఈ ఆలయానికి పిరమిడ్ ఆకారంలో శిఖరం నిర్మించబడి ఉంది (అది ప్రస్తుతం లేదు). ఈ ఆలయానికి ఉత్తరంగా మరొక చిన్న గుడి ఉండేది. అందులో అన్నపూర్ణ దేవి ప్రతిమ ఉండేది. ఇప్పటికీ ఈ ఆలయంలో గణపతి, మత్య్సావతారం, చతుర్ముఖలింగం, సూర్య, విష్ణు, నంది మొదలైన విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రసిద్ధక్షేత్రంగా అభివృద్ధి చెందిన దేవాలయం ఇది. కాబట్టి విద్యానాథుడు దీన్ని త్రిలింగ దేశానికి ఒక సరిహద్దుగా కీర్తించాడు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com