Thursday, May 22, 2025

చిక్కుల్లో సోనియా-రాహుల్

తల్లీ, తనయుడు కలిసి 142 కోట్ల లబ్ధి : ఈడీ రిపోర్ట్‌
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ధి పొందారని బుధవారం నాడు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తల్లీతనయులిద్దరూ రూ.142 కోట్లు అయాచితంగా లబ్ధి పొందారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా, రాహుల్ గాంధీలు ఇరువురూ రూ.142 కోట్ల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరఫు ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. నేర కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఏ ఆస్తినైనా నేర ఆదాయంగా పరిగణిస్తారని ఈడీ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. నిందితులు అందుకున్న రూ.142 కోట్ల అద్దె ఆదాయాన్ని నేరం ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించాలని ఈడీ న్యాయవాది హుస్సేన్ ఢిల్లీ కోర్టులో పేర్కొన్నారు. యంగ్ ఇండియన్‌లో 76% వాటాను కలిగి ఉన్న సోనియా, రాహుల్ గాంధీ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈడీ ప్రకారం, యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్‌) నుంచి రూ.90.25 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు సంపాదించింది.

గత నెలలో ఈడీ చార్జిషీట్ దాఖలు
గత నెలలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు సహా అనేక మందిపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో నిందితులు రూ. 988 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని బహుళ సెక్షన్ల కింద ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఈ చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ చార్జిషీట్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మొదటి నిందితురాలిగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ అయిన రాహుల్ గాంధీని ఈడీ రెండవ నిందితుడిగా పేర్కొంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కీలక సభ్యులు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్ ప్రధాన అధికారుల సమన్వయంతో AJL ఆస్తులను నియంత్రించడానికి నేరపూరిత కుట్ర పన్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ. 2,000 కోట్ల విలువైనవని అంచనా. ముఖ్యంగా, నేషనల్ హెరాల్డ్ పత్రికతో సంబంధం ఉన్న AJL ఒక అన్‌లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com