Thursday, May 15, 2025

రైళ్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

  • అధికారులు ముందస్తు కార్యాచరణను పాటించాలి
  • దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్

సమయపాలన, భద్రతను నిర్ధారించడానికి, రైళ్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దీనికి సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ సూచించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో జోన్‌ల రైలు కార్యకలాపాల నిర్వహణ, భద్రత, సమయపాలనలపై జిఎం అరుణ్ కుమార్ జైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ ఆర్.ధనంజయులు తో పాటు మొత్తం 6 డివిజన్‌లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డిఆర్‌ఏంలు ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైళ్లను సురక్షితంగా నడిపేందుకు భద్రతకు సంబందించిన విధి, విధానాలను కచ్చితంగా పాటించాలని జిఎం అధికారులను ఆదేశించారు.

ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి
లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు , పర్మినెంట్ వే మెయింటెనెన్స్ సిబ్బంది, రన్నింగ్ సిబ్బందిని క్రమం తప్పకుండా భద్రతపై కౌన్సిల్ నిర్వహించాలని ఆయన సూచించారు. పని ప్రదేశాల్లో భద్రతా అవసరాలను తప్పకుండా పాటించేలా తరుచుగా క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇంజనీరింగ్, మెకానికల్, సిగ్నలింగ్ పరికరాలు మొదలైన భద్రతా వస్తువుల లభ్యత గురించి జిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్రాక్, సిగ్నల్ మెయింటెనెన్స్ మొదలైన వాటికి సంబంధించిన నిర్వహణ పనులు చేపట్టే ముందు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిఎం అధికారులకు సూచించారు. వేగ పరిమితుల విధింపుపై సమీక్షించిన ఆయన రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరచడానికి అవసరమైన చోట వాటిని విధించి అలాగే అనవసరమైన ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలని అధికారులకు ఆయన సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com