Thursday, May 8, 2025

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి…

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. షాలిమార్, సంత్రగాచి, కొల్లానికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ టు -సంత్రగాచి (07223) రైలు ప్రతి శుక్రవారం ఏప్రిల్ 17 నుంచి జూన్ 18 వరకు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సంత్రగాచి నుంచి సికింద్రాబాద్ (07224) రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం రైలు పరుగులు తీయనుంది.

ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ స్టేషన్‌లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇక సికింద్రాబాద్ -టు షాలిమార్ (07225) రైలు ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు సోమవారం అందుబాటులో ఉంటుంది. షాలిమార్-సికింద్రాబాద్ ( 07226) రైలు ఈ నెల 16వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు ప్రతి మంగళవారం నడువనుంది.

ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, సంత్రగాచి మీదుగా వెళ్లనుంది. సికింద్రాబాద్- టు కొల్లం (07193) రైలు ఈ నెల 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. కొల్లం- టు సికింద్రాబాద్ (07194) రైలు ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 నడువనుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, తమిళనాడులోని కాట్‌పాడి, ఈ-రోడ్, కోయంబత్తూరు, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్‌ల ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com