- నేడు, రేపు సికింద్రాబాద్ టు విశాఖ,
- విశాఖ టు సికింద్రాబాద్‌లకు ప్రత్యేక రైళ్లు
ఎన్నికల రద్దీ దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికలు ఉండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణ నుంచి ఎపికి ఓటర్లు భారీగా తరలివెళ్లారు. సోమవారం ఎన్నికలు ముగియడంతో హైదరాబాద్ నుంచి సొంతర్లకు వెళ్లిన ఓటర్లు మంగళ, బుధవారాల్లో తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. ఈ రద్దీ వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య మంగళ, బుధ వారాల్లో ఓ ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైలు మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అంతేగాక బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లో మళ్లీ బయలుదేరి అదే రోజు రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు తెలియజేశారు.