Thursday, December 26, 2024

దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం

యూపీఏ హ‌యాంలోనే విప్ల‌వాత్మ‌క మార్పులు
సదరన్ రైజింగ్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ హయాంలో భాక్రాంనంగల్, నాగార్జున ప్రాజెక్టుల నుంచి అభివృద్ధి కోసం ఎన్నో ప్రాజెక్టులను కట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. హైదరాబాద్ వేదికగా జరిగిన సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ ఈవెంట్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి అనంతరం కీలక ప్రసంగం చేశారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగిందని, కానీ ఎన్డీయే హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో తో ఎన్నో మార్పులు చేశారని, ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టారని, రాజీవ్ గాంధీ హయాంలో ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు మార్చారని, కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకురావడంతో పాటు టెలికాం రంగంలో మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహాత్మగాంధీ ఆలోచనల ప్రకారం స్థానిక సంస్థల్లో అధికారాలను కల్పించిన ఘనత తమదేనన్నారు. పీవీ నరసిహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన గొప్పవ్యక్తి అని, తెలంగాణకు చెందిన పీవీ ఎల్పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన తెలుగు ఠీవి పీవీ నరసింహారావు అని రేవంత్ కొనియాడారు.

ప్ర‌ధాని మోదీ ఏం చేశారు..?
ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టారని, ఆయన హయాంలో దేశానికి ఏం సేవలు చేశారని, ఎవరికి ప్రయోజనం చేకూర్చారని సదరన్ రైజింగ్ సమ్మిట్ వేదికగా రేవంత్ ప్రశ్నించారు. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం చేశారని, ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు పనిచేశారని, ప్రజలకు మాత్రం ప్రధాని మోదీ పార్టీ ఏం చేయలేదన్నారు. గతంలో నార్త్ ఇండియా నుంచి ప్రధాని అయితే, సౌత్ ఇండియా నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించిందని, కానీ ప్రధాని మోదీ హయాంలో ఇలాంటి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారన్నారు. అందుకే దక్షిణాది నుంచి నీలం సంజీవరెడ్డి, అబ్దుల్ లాంటి వాళ్లు రాష్ట్రపతి అయ్యారని, ఎన్డీయే హయాంలో కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రధాని మోదీ పార్టీ ప్రయత్నాలు చేసింది కానీ దక్షిణాదికి చేసిందేమీ లేదని ఆరోపించారు. దక్షిణాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని, ఇప్పుడు ఎన్డీయే మాత్రం రాష్ట్రాల‌ నుంచి పన్నులు పెద్ద ఎత్తున తీసుకుంటుంద‌ని, తిరిగి ఇచ్చింది ఏమీ లేదంటూ మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వానికి మేం ఓ రూపాయి పంపిస్తే.. మాకు 40 పైసలు తిరిగి పంపిస్తోందని, అదే ఉత్తరప్రదేశ్ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే వాళ్లకు 7 రూపాయలు వెనక్కి వస్తున్నాయన్నారు. బిహార్‌కి కూడా రూ.6 వస్తున్నాయని, నార్త్ కన్నా దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువ ట్యాక్స్ వెళ్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలన్ని పట్టించుకోవడం లేదని, ప్రధాని మోదీ ఉత్తరాదికి చెందిన వ్యక్తి కావడమే కారణమని రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com