జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు విచాక్షణరహితంగా దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు విష్ణు, మంచు మనోజ్, నాని సహా పలువురు నటులు రియాక్ట్ అయ్యారు. పహల్గాంలో 28 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఘటన హృదయ విదారకమైందని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇది క్షమించరాని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మరణించిన వారి కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అలానే పహల్గాం దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా” అని తారక్ రాసుకొచ్చారు. పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం. తమవారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి సమయంలో మనం మరింత బలంగా నిలబడాలి. ఈ దుఃఖ సమయంలో ఐక్యంగా, స్ఫూర్తితో ఉండాలి. ఉగ్రవాదం మనల్ని ఎప్పటికీ విభజించలేదు. జై హింద్” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
ఇక ఇదిలా ఉంటే ఇలా సోషల్ మీడియాద్వారా కన్నీరు కార్చడం వరకేనా వీళ్ళ బాధ్యత. వీళ్ళు అలా.. వాళ్ళు ఇలా… అంటూ సంతాపాలు తెలియజేయడం తప్ప బాధిత కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. వారికి ఎంతోకొంత మా నుంచి చేయూత లభిస్తుంది. ఆర్ధికంగా వారిని ఆదుకుంటాం లాంటి మాటలేమీ లేవా… అంటే వీరికి బాధ్యత లేదా. భారతదేశ పౌరులుగా వీరికి సంబంధం లేదా. సహాయం అనేసరికి కేవలం ప్రభుత్వం మాత్రమే చేయాలా. సినిమాలు తీస్తూ కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే వీరికి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియవా. సీనియర్ హీరో చిరంజీవి దగ్గర నుంచి యంగ్ హీరో నాని, బన్నీ వరకు కేవలం స్పందించడం మాత్రమే వీరి పనా.. అని సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఈ కాల్పుల్లో ఎంతో మంది తమ తండ్రిని పోగొట్టుకున్న చిన్నారులు ఉన్నారు. భర్తను పోగొట్టుకుని ఎటువంటి ఆసరాలేని మహిళలు కూడా ఉన్నారు. చెట్టు అంత ఎదిగి చేతికి వచ్చిన కొడుకులు ఉన్నారు మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి. వీరందరికి కేవలం ప్రభుత్వం మాత్రమే అండగా నిలవాలా వీరెవ్వరూ ఎటువంటి సాయం చేయరా? కేవలం హీరోలు మాత్రమే హీరోయిన్లు కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏమీ ఎక్కడ ఈ మధ్య కాలంలో తగ్గడం లేదు. హీరోలన్నా అడపా.. దడపా ఏదో ఒక విషయంలో సాయం చేయడానికి ముందుకు వస్తారు కానీ. హీరోయిన్లయితే అసలు ముందుకే రారు. వచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా గతంలో కనిపించలేదు. ఎక్కడో కొంతమంది హీరోయిన్లు ఏదో ఒకరు ఇద్దరు పిల్లలను ఎడాప్ట్ చేసుకుని వారి బాగోగులు చూడడం లాంటివి విన్నాంకానీ పూర్తిగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారు స్పందించింది లేదు.