టీఎస్, న్యూస్:రాష్ట్రంలో నీటి నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల వారీగా త్రాగునీటి సమస్యలు రాకుండా ఐఏఎస్ అధికారులకు నిర్వహణ బాధ్యతలను సర్కార్ అప్పగించింది.