Wednesday, October 2, 2024

తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు

ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

తెలంగాణలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పది జిల్లాలకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలని స్పెషల్‌ ఆఫీసర్లను సర్కారు ఆదేశించింది. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక హైదరాబాద్‌ జిల్లా బాధ్యతలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమప్రాలికి అప్పగించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలను సురేంద్ర మోహన్‌కు ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఇలంబర్తి, కరీంనగర్‌కు ఆర్వీ కర్ణన్‌, నల్గొండకు అనితా రామచంద్రన్‌, రంగారెడ్డికి డీ దివ్య, నిజామాబాద్‌కు ఏ శరత్‌, మహబూబ్‌నగర్‌కు రవి, వరంగల్‌కు టీ వినయ్‌ కృష్ణారెడ్డి, ఉమ్మడి మెదక్‌కు హరిచందనను నియమించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular