కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓడిపోయారంటూ – సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడం, కాంగ్రెస్ ఫలితం మారకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ రిజల్ట్‌తో సంబంధం లేని తెలంగాణలో మాత్రం ఎక్కువ కొట్టుకుంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, భవిష్యత్‌లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇలాంటి పరాభవం తప్పదని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అదే టైంలో కాంగ్రెస్ నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌ను టార్గెట్ చేసారు. ఆయనతో కలిసి వారంతా అస్సాం ట్రైన్ ఎక్కేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ దీన స్థితి చూసి జాలేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ డైమండ్ డకౌట్ అయ్యారని ఎద్దేవా చేశారు. మూడుసార్లు కూడా సున్నాకే పరిమితం కావడం కొత్త చరిత్ర అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధిస్తున్నారు కిషన్ రెడ్డి.
సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాలు కేటీఆర్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని ఢిల్లీ వెళ్లి గుండు సున్నా తెచ్చారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించారన్నారు. బీజేపీకి అతి పెద్ద కార్యకర్త రాహుల్ గాంధీ అని విమర్శలు చేశారు కేటీఆర్. మరో మాజీ మంత్రి హరీష్‌రావు కూడా కాంగ్రెస్‌కు వచ్చిన ఫలితాలపై విమర్సలు చేశారు. కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని అన్నారు. రాహుల్, రేవంత్ కలిసి బీజేపీ విజయానికి కారణమయ్యారని అన్నారు.