అమరావతి,13:రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్ధికేతర మరియు స్వల్ప కాలంలో పరిష్కరించ గలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయాశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య,ఆరోగ్య,హోం,జిఏడి,న్యాయ,దేవాదాయ ధర్మాదాయ,ప్రణాళిక, ఎక్సైజ్,జల వనరులు,మైన్స్ అండ్ జియాలజీ,ఇంధన,వ్యవసాయ,సహకార,పశుసంవర్ధక, మత్స్య,గ్రామ,వార్డు సచివాలయ,సాంఘిక,బిసి,మైనార్టీ,ఇబిసి సంక్షేమం,చేనేత జౌళి శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు,ముఖ్యంగా 100 రోజుల్లో పరిష్కరించ గలిగే ఆర్థికేతర పరమైన అంశాలకు సంబంధించి సమీక్షించారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న మరియు ఆర్ధికేతర అంశాలకు చెందిన వివిధ ప్రజా సమస్యలు లేదా ఇతర అంశాలను 100 రోజుల్లోగా పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.అనంతరం శాఖల వారీగా 100 రోజుల్లో పరిష్కరించ దగ్గ ప్రాధాన్యతాంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశిచారు.
ఈసమావేశానికి వర్చువల్ గా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి.కృష్ణ బాబు,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.సత్య నారాయణ పాల్గొన్నారు.అదే విధంగా సమావేశంలో దేవాదాయశాఖ కార్యదర్శి ఎస్.సత్య నారాయణ,న్యాయ శాఖ కార్యదర్శి సునీత,జిఏడి అదనపు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు,ఇంకా ప్రణాళిక,ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
(జారీ చేసినవారు:డైరెక్టర్ సమాచార పౌరసంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)